Telugu Updates

Sunday 3 February 2013

నిర్ణయం జరిగింది.. టైమ్ రావాలి -తెలంగాణపై ప్రధాని మాట.. ఎన్సీపీ నేత పవార్ నోట

నిర్ణయం జరిగింది.. టైమ్ రావాలి -తెలంగాణపై ప్రధాని మాట.. ఎన్సీపీ నేత పవార్ నోట:

-కేబినెట్ అనంతరం మన్మోహన్‌తో పవార్ భేటీ
-తెలంగాణపై సత్వరమే తేల్చాలని వినతి.. యూపీఏ పక్షాల సమావేశానికి సూచన
-జాప్యం వల్ల ఉపయోగం ఉండదు.. హైదరాబాద్ కొంతకాలం ఉమ్మడి రాజధాని
-విలేకరులతో పవార్.. విదర్భ ఇస్తే వ్యతిరేకించబోమని వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 31 (టీ మీడియా):తెలంగాణ విషయంలో నిర్ణయం జరిగిపోయిందని, దానిని వెల్లడించేందుకు తగిన సమయం కోసమే చూస్తున్నామని ప్రధాని మన్మోహన్ తనకు చెప్పారని ఎన్సీపీ నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ తెలిపారు. గురువారం ఉదయం ప్రధాని కార్యాలయంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మన్మోహన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సత్వరమే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని ఆయన ప్రధానిని కోరారు. అనంతరం తమ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ నివాసంలో విలేకరులతో జరిపిన ఇష్టాగోష్ఠిలో పవార్ మాట్లాడారు. ‘కాంక్షిగెస్ తెలంగాణ ఏర్పాటుకు సానుకూలమే. సమస్యల్లా (తెలంగాణ ఏర్పాటు) ఎప్పుడన్నదే. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ఏర్పాటు చేయాలని మేం కోరుతున్నాం. జాప్యం మనకు ఉపయోగపడదు’ అని కేంద్ర మంత్రి అన్నారు. చాలా కాలం నుంచి తమ పార్టీ తెలంగాణకు మద్దతుగా నిలుస్తున్నదని ఆయన తెలిపారు.

కొన్నేళ్ల క్రితం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావుతో కలిసి తాము ర్యాలీలో కూడా పాల్గొన్నామని గుర్తు చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ అనుకూలంగానే ఉందన్న పవార్.. త్వరలోనే నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణపై యూపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం త్వరలో ఉంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. తద్వారా ఈ అంశంపై బహిరంగంగా మద్దతు ప్రకటించిన తొలి యూపీఏ పక్ష పార్టీగా ఎన్సీపీ నిలిచింది. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే తెలంగాణపై తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినప్పుడు దానిని యూపీఏ ఎజెండాలో చేర్చాం కదా.. అని ప్రధాని తనతో అన్నారని తెలిపారు. తెలంగాణపై నిర్ణయం జరిగిందని, సమయం కోసమే వేచి చూస్తున్నామని ప్రధాని తనకు చెప్పారని పవార్ వివరించారు.

యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ అంశాన్ని 2004 యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్షికమంలో చేర్చిన విషయాన్ని, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపర్చిన సంగతిని తాను మరోసారి ప్రధానికి గుర్తుచేశానని పవార్ చెప్పారు. త్వరలో యూపీఏ సమన్వయ కమిటీని సమావేశపర్చి తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరానన్నారు. ఈ సందర్భంగా విలేకరులడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. రాజధాని హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగంగానే ఉంటుందని చెప్పారు. కొద్ది రోజులపాటు రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే అవకాశాలున్నా.. సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మించగానే తెలంగాణలో భాగంగానే హైద్రాబాద్ ఉంటుందన్నారు. తెలంగాణపై దాదాపు నిర్ణయం జరిగే ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేసిన పవార్ కేంద్రం సరైన సమయం కోసం వేచిచూస్తున్నదని అభివూపాయపడ్డారు.

విదర్భకు అడ్డుపడం: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించినా తమకు అభ్యంతరం లేదని పవార్ చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎన్సీపీ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ‘విదర్భ ఏర్పాటుకు మేం అడ్డుపడం’ అని ఆయన చెప్పారు. తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడం విదర్భ ప్రాంతంపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు తాను అలా భావించడం లేదన్నారు. ‘ప్రజలు కోరితే దారికి అడ్డుపడరాదన్నదే మా అభివూపాయం’ అని స్పష్టం చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేశారనడాన్ని ఆయన కొట్టిపారేశారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో చెప్పిన నేపథ్యంలో పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. ఎన్సీపీ మాదిరి వైస్సార్సీపీ కూడా కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకుంటుందా? అన్న ప్రశ్నకు.. కాంగ్రెస్‌లో వారు ఎలా వ్యవహరిస్తారన్నది తనకు తెలియదని పవార్ చెప్పారు. పొత్తుల విషయం వచ్చేసరికి జగన్ ప్రత్యేకించి ఆంధ్రవూపదేశ్‌లో ఒక ముఖ్యమైన శక్తిగా ఉంటారని ఆయన అభివూపాయపడ్డారు.

తెలంగాణ ఎప్పుడో ప్రత్యేక రాష్ట్రం: తెలంగాణ ఎప్పుడో ప్రత్యేక రాష్ట్రంగా ఉన్నదని, దానినే ఇప్పుడు ఆంధ్రవూపదేశ్‌ను విభజించి ఇవ్వాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి డీపీ త్రిపాఠీ చెప్పారు. ఇందుకోసం రెండవ ఎస్సార్సీ వేయాల్సిన అవసరమే లేదని అన్నారు. జాప్యం లేకుండా వీలైనంత త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు తాము ఎప్పటి నుంచో అనుకూలంగానే ఉన్నామని గుర్తు చేశారు. ఏడు సంవత్సరాల క్రితమే తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేశామని చెప్పారు. తమ అధినాయకుడు శరద్‌పవార్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌తో కలిసి ఆదిలాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారని గుర్తు చేశారు. తత్కాల్ విధానంలో తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

తెలంగాణపై నిర్ణయానికి యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. పవార్ ప్రకటనపై హరీష్, పొన్నాల హర్షం: తెలంగాణకు మద్దతుగా మాట్లాడిన కేంద్ర మంత్రి శరద్‌పవార్‌కే టీఆర్‌ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్‌రావు, రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పట్ల అంకిత భావంతో పవార్.. ప్రధానితో చర్చలు జరపడంపై హరీష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి తెలంగాణకు అండగా నిలుస్తున్నందున పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

Chitika Ads