Telugu Updates

Sunday 3 February 2013

శంకర్‌రావుపై ఖాకీ జులుం -తెలంగాణ దళిత ఎమ్మెల్యేకు అవమానం..

శంకర్‌రావుపై ఖాకీ జులుం -తెలంగాణ దళిత ఎమ్మెల్యేకు అవమానం..: శంకర్‌రావుపై ఖాకీ జులుం
-తెలంగాణ దళిత ఎమ్మెల్యేకు అవమానం.. 

-బట్టలేసుకోనీయకుండా.. తోసుకుంటూ వ్యాన్ ఎక్కించి
-ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసుల ఓవరాక్షన్

- అనారోగ్యంతో ఉన్ననేతపై అమానుష వైఖరి
- తొలుత నేరేడ్‌మెట్ పీఎస్‌కు.. అటు నుంచి గాంధీకి..
- విమర్శల వెల్లువతో పోలీసుల వెనుకడుగు
- విచారణ నిమిత్తమే తీసుకెళ్ళామని సంజాయిషీ
- కేర్‌కు తరలించిన కుటుంబసభ్యులు
- తీవ్ర అస్వస్థతతో శంకర్‌రావు.. పడిపోయిన షుగర్, బీపీ ఖాకీ జులుంపై వెల్లువెత్తిన ఆగ్రహం
- దళితుడైనందునే ఏకపక్ష దూకుడు వైఖరా?
- కోట్లు మింగేస్తున్న అక్రమార్కులను ఏం చేస్తున్నారు?
- తెలంగాణ నేతపై వివక్షంటూ ఆందోళనలు
- అరెస్టుపై కలకలంతో నష్ట నివారణకు దిగిన సర్కారు
- మంత్రులు, కాంగ్రెస్ నేతల స్పందనలు, ఖండనలు
సీమాంధ్ర సర్కారు ద్వంద్వ నీతి మరోమారు స్పష్టంగా బయటపడింది. బడా వ్యాపారాలు చేసుకుంటున్న సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లెక్కలేనన్ని ఆస్తులను వెనకేసుకుంటున్నా.. వారిని అరెస్టు చేసి కటకటాల వెనుకకు పంపించాల్సి ఉన్నా.. ఉపేక్షిస్తున్న ప్రభుత్వం, తెలంగాణకు చెందిన ఒక దళిత నేతపై మాత్రం ప్రతాపం చూపించింది. కనీస చట్ట నిబంధనలు, మానవ మర్యాదలు పాటించకుండా అవమానపరిచింది. గ్రీన్‌ఫీల్డ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రస్తుత శాసనసభ్యుడు శంకర్‌రావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనారోగ్యంతో పడుకున్న ఆయనను, బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా కుటుంబసభ్యుల మాటలు వినకుండా, హడావిడిగా, దాదాపు తోసుకెళుతూ వాహనంలోకి ఎక్కించుకుని పోయారు. పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. బైపాస్ సర్జరీ జరిగి, లోబీపీతో బాధపడుతున్న శంకర్‌రావు పట్ల మానవీయంగా కాకుండా అమానుషంగా వ్యవహరించారని అధికార, విపక్ష నేతలు, పలువురు మంత్రులు, ఎంపీలు తప్పుబట్టారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను పోలీసులు నిర్బంధించి తీసుకెళ్ళిన తీరును తీవ్రంగా ఖండించారు. పరిస్థితి వేరే విధంగా మారనుందని, విపరిణామాలకు దారితీయనుందని గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్షికమించింది.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రి జానాడ్డి, మంత్రులు దానం నాగేందర్, బాలరాజ్, ప్రసాద్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తదితర కాంగ్రెస్ నేతలు పోలీసుల తీరును తప్పుబట్టారు. దళిత సంఘాలు, తెలంగాణవాదులు, మంత్రులు కూడా తప్పుబట్టడంతో పోలీసులు మాట మార్చారు. ఆయనను అరెస్టు చేయలేదని, విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పవూతికి తరలించిన పోలీసులు అక్కడ గద్దర్ పరామర్శించడం, దళిత నేతలతోసహా అధికారంలోని మంత్రులు కూడా తప్పుబడుతుండటంతో ఇక తప్పుకోవడమే సరైనదనే నిర్ణయానికొచ్చారు. శంకర్‌రావు ఆయన ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళొచ్చని వెల్లడించారు. అనంతరం కుటుంబసభ్యులు ఆయనను కేర్ ఆస్పవూతికి తీసుకెళ్ళారు. ఎంపీలు వివేక్, విజయశాంతి, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జగదీశ్వర్‌డ్డి, ప్రజా గాయకుడు గద్దర్, మంద కృష్ణమాదిగ, మాల మహానాడు నేత కారెం శివాజీ, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డారు. పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

shankarrao01నేరేడ్‌మెట్, జనవరి 31 (టీ మీడీయా):భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, శాసనసభ్యుడు శంకర్‌రావును గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంకర్‌రావు అరెస్టుతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ముషీరాబాద్‌లోని ఆయన నివాసానికి గురువారం మధ్యాహ్నం వచ్చిన పోలీసులు అనారోగ్యంతో మంచంపై ఉన్న శంకర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ఒంటిపై సరిగా దుస్తులు లేకున్నప్పటికీ అదే పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి, బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. దీనితో అక్కడ కొంత గందరగోళ వాతావరణం తలెత్తింది. ముందుచూపుతో వచ్చిన పోలీసులు సమస్య జటిలం కాకముందే ఆయనను అక్కడినుంచి తీసుకొని వెళ్లిపోయారు.

కుటుంబసభ్యులు అన్యాయమని, తీసుకెళ్ళొద్దని విలపిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఆగ్రహంతో వారు పోలీసులపై ఆరోపణలు కురిపించారు. వేరే కారణాలతోనే కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. శంకర్‌రావు కూడా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం పరిణామాలన్నీ టీవీ చానెళ్లలో ప్రసారమవుతుంటే సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్పందించారు. ఆ సమయంలోనే మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసుల నిర్ణయం మారిపోయింది. రాత్రి 11 గంటల సమయంలో శంకర్‌రావును అరెస్టు చేయలేదు.. విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నాం.. అని వివరించారు. నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్ నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పవూతికి తీసుకువచ్చిన పోలీసులు.. ఆ తర్వాత తాము శంకర్‌రావును అరెస్టు చేయలేదని, కుటుంబసభ్యులు చికిత్స కోసం ఎక్కడికైనా తీసుకు చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు. కుటుంబసభ్యులు ఆయనను కేర్ ఆస్పవూతికి తరలించారు.

నేపథ్యమిదీ..: మల్కాజిగిరి మండలం అల్వాల్ మున్సిపాల్టి ఖానాజీగూడ గ్రామంలోని గ్రీన్‌ఫీల్డ్స్ కాలనీ సర్వేనంబర్ 373, 375,376, 378, 379, 386లలో 63 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. జీఓఎంస్ నంబర్ 166 ప్రకారం అదే గ్రామంలో 374, 380, 381 సర్వేనంబర్లలో 13 ఎకరాల స్థలం కూడా ఇదే కాలనీలో ఉంది. ఈ భూములపై ఆక్యుపెన్సీ హక్కుల సర్టిఫికెట్ తనకు ఉంది కాబట్టి ఈ స్థలం తనదేనంటూ ఎమ్మెల్యే శంకర్‌రావు ఈ స్థలాన్ని కబ్జాచేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక తహశీల్దార్, జాయింట్ కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి జీవో నంబర్ 166 ప్రకారం జరుగాల్సిన రెగ్యులరైజేషన్ పక్రియకు అడ్డుపడ్డాడని శంకర్‌రావుకు వ్యతిరేకంగా గ్రీన్‌ఫీల్డ్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సీ చంద్రశేఖర్ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో ఆయనపై కేసులు నమోదు చేయాలంటూ నవంబర్ 9, 2011న మల్కాజిగిరి పదవ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు (ఆర్డర్‌నెంబర్ 485/2011) ప్రకారం జారీ చేశారు. నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 120బీ, 197, 420, 468, 471, 406, 506 తదితర పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

అక్టోబర్ 13, 2012న..
గత సంవత్సరం అక్టోబర్ 13న శంకర్‌రావును అరెస్ట్ చేసేందుకు అల్వాల్ జోన్ ఏసీపీ గణేష్‌డ్డి ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలతో కూడిన సుమారు 15 మంది పోలీసుల బృందం ముషీరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ పోలీసు బృందాలు వెళ్లిన సమయంలో శంకర్‌రావు ఇంట్లో లేకపోవడంతో పోలీసులు తిరిగి వచ్చారు. ఆ సమయంలో గ్రీన్‌ఫీల్డ్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌కు శంకర్‌రావు మనుషుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో ఆయనను కొన్నిరోజులపాటు పోలీసుల రక్షణలో ఉంచారు. అక్టోబర్ 14వ తేదీన ఈ కేసు విషయంపై ఆ కాలనీ ప్లాట్ ఓనర్ల స్టేట్ మెంట్లను నేరేడ్‌మెట్ పోలీసులు రికార్డ్ చేశారు. సుమారు 20 మంది నుంచి విడి విడిగా వివరాలను సేకరించారు. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ మల్కాజిగిరి తహశీల్దార్ నర్సింహారావుకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 13 నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్‌రావు గాలింపు కోసం పది ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు.

పక్కా ప్లాన్‌తో అరెస్ట్
గురువారం ఉదయం నుంచే డీసీపీ శివకుమార్, నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మంతనాలు జరిపి పక్కా ప్లాన్‌తో శంకర్‌రావును అరెస్ట్ చేశారు. సుమారు 100 మంది పోలీసు బలగాలతో శంకర్‌రావు ఇంటిని ముట్టడించిన పోలీసులు సాయంత్రం 5.30 నిమిషాలకు ఆయనను నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. డీసీపీ శివకుమార్, అల్వాల్ జోన్ ఏసీసీ గణేష్‌డ్డి, నేరేడ్‌మెట్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌లు శంకర్‌రావును 45 నిమిషాలపాటు విచారించారు. శంకర్‌రావును పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన గంటన్నర తర్వాత ఆయన కూతురు అక్కడకు వచ్చారు. లోపలికి పంపించకపోవడంతో పోలీసులకు ఆమెకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఆమెను లోపలికి పంపించారు. ఆ సందర్భంలో ఆమె కోపోవూదిక్తురాలై తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పోలీసులపై మండిపడ్డారు. శంకర్‌రావు అరెస్ట్‌తో నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అల్వాల్, మల్కాజిగిరి, కుషాయిగూడ, కీసర, నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్లలోని సీఐలు, ఎస్సైలతో కూడిన వందలాది పోలీస్ బలగాలతో బందోబస్తు చేశారు. మీడియా కవరేజీ కోసం వెళ్లిన విలేకరులపై మల్కాజిగిరి అదనపు ఇన్‌స్పెక్టర్ అశోక్ అత్యుత్సాహం చూపడంతో విలేకర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ వైపు గ్రీన్‌ఫీల్డ్స్ బాధితులు శంకర్‌రావు డౌన్ డౌన్ అంటే శంకర్‌రావు వెంబడి వచ్చిన అతని అనుచరులు శంకర్‌రావు జిందాబాద్ అని నినాదాలు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

గాంధీలో గందరగోళం
కోర్టులో హాజరుపరిచే ముందు వైద్య పరీక్షల నిమిత్తం శంకర్‌రావును నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ నుంచి భారీ బందోబస్తు మధ్య పోలీసు వాహనంలో గాంధీ ఆసుపవూతికి తరలించారు. వాహనంలోకి ఎక్కించే సమయంలో ఆయన పూర్తిగా అనారోగ్యంగా ఉన్నట్లుగా కనిపించారు. ఆయన వెంట కూతురు కూడా వెళ్ళారు. శంకర్‌రావును నేరేడ్‌మెట్ నుంచి గాంధీ ఆస్పవూతికి తరలించిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పవూతికి తరలి వచ్చారు. శంకర్‌రావు అరెస్టుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేసిందని విమర్శించారు. ముఖ్యమంవూతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండుగంటలపాటు గాంధీ ఆస్పవూతిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆస్పవూతిలో ఉన్న శంకర్‌రావును చూసేందుకు ప్రజా గాయకుడు గద్దర్‌తోపాటు పలువురు ప్రముఖులు వచ్చారు. మరోవైపు శంకర్‌రావును అరెస్ట్ చేయడంతో అల్వాల్ బుజ్జి ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్స్ బాధితులు సంబరాలు జరుపుకున్నారు.

No comments:

Post a Comment

Chitika Ads