Telugu Updates

Sunday 3 February 2013

రాజీనామాలపై రాజీలేదు-టీ కాంగ్రెస్ ఎంపీల స్పష్టం

రాజీనామాలపై రాజీలేదు-టీ కాంగ్రెస్ ఎంపీల స్పష్టం:


- లేఖలు ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చాం
- మధుయాష్కీ ప్రకటన వ్యక్తిగతం
- రాజీనామాల వల్లే చాకో ప్రకటన: టీఎంపీలు

హైదరాబాద్, జనవరి 31 (టీ మీడియా): తెలంగాణ సాధన కోసం చేసిన రాజీనామాల విషయంలో వెనక్కితగ్గేది లేదని టీ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఎంపీల్లో భేదాభివూపాయాలున్నాయన్న వార్తలో వాస్తవం లేదన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు పార్టీ వ్యతిరేకం కాదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో చేసిన ప్రకటన ఎంపీల రాజీనామాల వల్లేనన్నారు. తెలంగాణపై చాకో ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. రాజీనామాల విషయంలో ఎంపీల మధ్య భేదాభివూపాయాలు ఉన్నాయని వచ్చిన వార్తల నేపథ్యంలో గరువారం పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు నివాసంలో అందుబాటులో ఉన్న ఎంపీలు జీ వివేక్, సిరిసిల్ల రాజయ్య, కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి భేటీ అయ్యారు. నియోజకవర్గంలో అధికారిక పనులు ఉన్నందున వల్ల పొన్నం ప్రభాకర్ తమను కలిసి వెళ్లిపోయాడని తెలిపారు. ఎంపీ గుత్తా సహకార ఎన్నికల వల్ల రాలేకపోయారని, మందా జగన్నాథం కర్ణాటకలోని బంధువుల వివాహ కార్యక్షికమానికి వెళ్లారని ఎంపీలు వివరించారు. సమావేశానికి రాని ఎంపీలతో.. మీడియా సమక్షంలో ఫోన్‌లో మాట్లాడి సందేహలను నివృత్తి చేశారు.

ఒక్కటిగానే ఉన్నాం : తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు.. రాజీనామాల విషయంలో ఆరుగురు ఎంపీలు ఒక్కటిగానే ఉన్నారని కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ సాధన అనేది రాజకీయ అంశం కనుక రాజీనామాలను పార్టీ అధినేవూతికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకే ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చామని వివరించారు. తెలంగాణ ఇవ్వకపోతే పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా లేమనే విషయాన్ని కూడా లేఖలో పేర్కొనట్లు చెప్పారు. తమ వెనుక రాజ్యసభ సభ్యుడు కేవీపీ ఉన్నరని అనడం పిచ్చిమాటలేనని కేకే ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణ వచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదన్నారు.

మీరూ పార్టీకి రాజీనామా చేస్తారా? అని కేకేను మీడియా ప్రశ్నించగా.. అరుగురు ఎంపీలతో తాను కూడా కలిసే ఉంటానని స్పష్టం చేశారు. టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ సాధన కోసం కార్యాచరణ ప్రకటించడానికి సమావేశం కానున్నారన్న విషయాన్ని ప్రస్తావించగా.. వారు తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నారని.. ఉద్యమ కార్యాచరణలో మాత్రం వెనక్కిపోతున్నారని కేకే వివరించారు. తెలంగాణకు కేవలం ముగ్గురు, నలుగురే వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుంటే కేంద్రం దిగి వస్తుందన్నారు. ఎంపీల మాదిరిగా వాళ్లు కూడా కలిసి వస్తే.. రాష్ట్ర విభజన తొందరగా జరుగుతుందని అభివూపాయపడ్డారు. కేసీఆర్ ముందుండి పోరాటం చేస్తున్నారు :తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ 12 ఏళ్లుగా ఉద్యమం చేస్తున్నారని కోమటిడ్డి రాజగోపాల్‌డ్డి అన్నారు.

టీఆర్‌ఎస్ ఒత్తిడి మేరకు రాజీనామాలు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు తమ రాజీనామాల విషయంలో ఎవరి ప్రభావంలేదని.. ప్రజల వత్తిడి మేరకే స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామాలు చేశామని చెప్పారు. రాజీనామాలు ఆమోదం పొందకపోతే బడ్జెట్ సమావేశాల్లో సభను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. రాజీనామాల వల్ల తెలంగాణ వస్తుందనే నమ్మకంలేదన్నారు. ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేసుకోవడం మంచిదేనని కోమటిడ్డి అభివూపాయపడ్డారు. దశలవారీగా అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువస్తామని వివేక్ అన్నారు. మధుయాష్కీ వ్యక్తిగత అభివూపాయాలతో తమకు సంబంధంలేదని, మిగతా ఎంపీలమంతా కలిసే ఉద్యమిస్తామని రాజయ్య పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Chitika Ads