Telugu Updates

Sunday 3 February 2013

తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని

తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని:
తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని
తెలంగాణకు ఎన్‌సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ ప్రధాని మన్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ఏర్పాటుపై ఎంత ఆలస్యంగా నిర్ణయం జరిగితే అంత నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధాని స్పందించారని తెలంగాణ అంశంపై ఇప్పటివరకు మేం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని మేమూ భావిస్తున్నాం అని ప్రధాని పవార్‌తో చెప్పారు.

స్థూలంగా కాంగ్రెస్‌ కూడా తెలంగాణాకు అనుకూలంగానే ఉంది. తెలంగాణా ఎప్పుడు ఏర్పాటవుతుందన్నదే ఇప్పుడు సమస్య ' అని శరద్ పవార్ మీడియాతో అన్నారు. తెలంగాణా ఏర్పడితే హైద్రాబాదే రాజధానిగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పవార్ చెప్పారు.

హైద్రాబాద్‌ లేని తెలంగాణా ఉండబోదు. కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకూ హైద్రాబాద్‌ను రెండు ప్రాంతాలకూ ఉమ్మడి రాజధానిగా ఉంచొచ్చు..' అని పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణా అంశం ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉందని కేంద్ర సమాచార శాఖా మంత్రి మనీష్‌ తివారీ పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం

No comments:

Post a Comment

Chitika Ads