Telugu Updates

Sunday 3 February 2013

వార్తలు కత్తి యుద్ధంలో ప్రభాస్, రాణాలకు ట్రై‌నింగ్

వార్తలు కత్తి యుద్ధంలో ప్రభాస్, రాణాలకు ట్రై‌నింగ్:
హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘బహుబలి'. ప్రస్తుత రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇది చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాణా కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ సోదరుడిగా నెగెటివ్ రోల్‌లో రాణా కనిపించబోతున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజే ఈ ట్రైనింగ్ మొదలైంది. ఈ విషయాలను తాజాగా రాజమౌళి వెల్లడించారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ‘బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

కిరణ్,బొత్స ల మధ్య వార్

కిరణ్,బొత్స ల మధ్య వార్:



ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మధ్య మళ్లీ ప్రచ్చన్న యుద్దం ముదిరినట్లు కధనాలు వస్తున్నాయి.దానికి తోడు ఈ ఇద్దరు నేతలకు చెరో ఛానల్ ఉండడంతో వాటిలో వచ్చే కధనాలు ఆధారంగా ఈ వివాదంపై కధనాలు వస్తున్నాయి.
బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది.పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దీనిపై మాట్లాడుతూ కిరణ్ ను కూలదోయడానికి బొత్స కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.దానిపై బొత్స వర్గం ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.ముఖ్యంగా ఈ వివాదాలపై ముఖ్యమంత్రి కిరణ్ కు చెందిన చానల్ లో బొత్స వ్యతిరేక కధనాలకు ప్రాముఖ్యత లభిస్తున్న తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పైగా జోగి రమేష్ పార్టీ వదలి పెడతారని ఒక ప్రచారంతో పాటు, ఆయన కిరణ్ కు సన్నిహితంగా ఉంటారని మరో ప్రచారం సాగుతుండడం విశేషం.బొత్స తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పకపోయినప్పట్టికీ, ఆయన అలా ప్రకటించడానికి ముందు సి.ఎమ్.తో మాట్లాడారా ?లేదా?ప్రభుత్వం మైనార్టీలోపడుతుందని తెలిసి కూడా బహిష్కరణ ప్రకటన చేయడంతో కిరణ్ ను ఇరుకున పెట్టే ఉద్దేశం ఉందా ?మొదలైన చర్చలు కాంగ్రెస్ లో జరుగుతున్నాయి.

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహ గర్జన : ఓయూ జేఏసీ

మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహ గర్జన : ఓయూ జేఏసీ:


తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మార్చి రెండో తేదీన హైదరాబాద్ నింజా కాళాశాల మైదానంలో తెలంగాణ విద్యార్థి సింహ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఓయూ జేఏసీ శనివారం ప్రకటించింది. అలాగే, మార్చి 20వ తేదీన ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని తెలిపింది.

వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 20 తేదీన చలో హైదరాబాద్ నిర్వహించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయు) జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

అలాగే, ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు, మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన, మార్చి 20న ఛలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని జేఏసీ నేతలు తెలిపారు.

Reddy raises Telangana isssue at meeting with Rahul Gandhi

Reddy raises Telangana isssue at meeting with Rahul Gandhi:

A strong plea for an early resolution of the vexed Telangana issue was made by an AICC Secretary during a meeting of Congress office bearers with Rahul Gandhi today.
P Sudhakar Reddy raised the issue at the meeting and he later said that Gandhi assured him to look into it.
Another party Secretary V Hanumanta Rao, who also hails from the Telangana region, said that the party Vice President told Reddy to focus on organisational issues for which the meeting has been called.
The issue of separate state of Telangana has divided Andhra Pradesh on regional lines and party MPs from the region have threatened to tender their resignation to Speaker Meira Kumar if urgent steps are not taken to carve out the state from Andhra Pradesh.
Andhra Pradesh is the only major state where the Congress is in power on its own and the spectacular showing there in the Lok Sabha polls helped the Congress to gain power at the Centre via the coalition route in 2004 and retain it in 2009.

Telangana continues to hang between hope and despair

Telangana continues to hang between hope and despair:



Even as the support from Nationalist Congress Party president Sharad Pawar to the demand for Telangana has come as a big shot in the arm for the proponent of the separate State, Congress party continues to play the game of hide and seek on the issue.
Pursuing a zig-zag line AICC general secretary Vayalar Ravi on Friday said that the consultations were still on and he could not give any date for taking a decision. But he said another round of talks would take place on February 20.
After meeting two  Telangana Congress MPs, G Vivek and Madhu Yashki Goud who resigned, separately in New Delhi, Ravi said that the issue needs further discussion and Chief Minister N Kiran Kumar Reddy will also be asked to come to Delhi soon.
Significantly he said that if other parties come forward to support the Bill, the Congress was ready to move Telangana Bill in the Parliament.
On the resignation by the seven MPs of the region, he said that he understands the pressure they were facing and their sentiments. Denying that Home Minister Sushilkumar Shinde had given a date for the decision by the Union Government, he said that the Centre had also not said that nothing would be done. Ravi said that discussions would also be held with the other MPs from the Telangana region.
Every day a new statement from the Congress leadership in New Delhi was adding to the confusion among the supporters of Telangana. PC Chacko, the official spokesperson of AICC said that the Congress was not against Telangana. However, he added the rider that first Andhra Assembly should pass a resolution to this effect, a demand always rejected by the proponents of Telangana saying that the deep divisions in AP Assembly make such a resolution impossible.



Telangana JAC to intensify stir from tomorrow

Telangana JAC to intensify stir from tomorrow:

Telangana JAC to intensify stir from tomorrow



 Urging the Telangana people to boycott the Congress leaders from the region, the Telangana Political Joint Action Committee (T-JAC) will launch a renewed separate statehood agitation on Monday, where the focus would be on putting pressure on the Telangana ruling party ministers to quitin view of the discouraging of the Congress-led UPA government on the issue.

According to the T-JAC, pro-T activists would obstruct the T-ministers from carrying out administrative duties and public activities. Releasing an eight-point agenda, for the agitation at the Samara Deeksha last Monday, the T-JAC appealed to people to boycott the Congress leaders till they quit the party and position in the government.

"The boycott is both political and social. People will not allow the ministers move around freely. T-JAC activists will stop the ministers from attending administrative duties as well as public activities such as meeting people. And this will continue till the ministers quit," said Pittala Ravinder, state co-coordinator of T-JAC.

There are thirteen ministers from Telangana in the Kiran Kumar Reddy cabinet including deputy chief minister C Damodar Raja Narasimha and panchayat raj minister K Jana Reddy. These ministers would be targeted with black flags and slogans.

While the main agitation would be at the Assembly constituencies of the ministers, demonstrations were also planned for the ten T-district headquarters and Hyderabad.

The final modalities of the agitation would be deliberated in a meeting of the steering committee of T-JAC on Sunday. Representatives of the constituent member parties of T-JAC including Telangana Rashtra Samithi (TRS), Bharatiya Janata Party (BJP) and New Democracy are scheduled to take part in the meeting.

While T-ministers would be targeted in the first phase, MLAs and MPs would face protests later, the T-JAC announced. "The agitation has been planned in phases. After concentrating on ministers and compelling them to quit, we will focus on MLAs and MPs. This time, the anti-Telangana political elements will surely taste the aggressiveness of the movement," said Pittala Ravinder.

While the T-JAC pledged to turn the Telangana movement into a militant struggle, Pittalla declined to confirm about demonstrations against the ministers as the beginning of it. He said, for a strategic reason he will not be able to divulge details of the plan.

Apart from targeting the Congress leaders, the T-JAC has planned to launch programmes to obstruct the functioning of the government machinery. While activists will lay siege to government offices and establishments, disconnect the power and water supply of government buildings, they also plan to block government employees from reaching their offices. A massive 'Chalo Assembly' would be launched in the month of March when the state Assembly meets for the budget session.

తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని

తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని:
తెలంగాణకు పవార్ మద్దతు: ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది: ప్రధాని
తెలంగాణకు ఎన్‌సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ ప్రధాని మన్మోహన్‌కు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణా ఏర్పాటుపై ఎంత ఆలస్యంగా నిర్ణయం జరిగితే అంత నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రధాని స్పందించారని తెలంగాణ అంశంపై ఇప్పటివరకు మేం ఒక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం చర్చల ప్రక్రియ జరుగుతోంది. సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని మేమూ భావిస్తున్నాం అని ప్రధాని పవార్‌తో చెప్పారు.

స్థూలంగా కాంగ్రెస్‌ కూడా తెలంగాణాకు అనుకూలంగానే ఉంది. తెలంగాణా ఎప్పుడు ఏర్పాటవుతుందన్నదే ఇప్పుడు సమస్య ' అని శరద్ పవార్ మీడియాతో అన్నారు. తెలంగాణా ఏర్పడితే హైద్రాబాదే రాజధానిగా ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా పవార్ చెప్పారు.

హైద్రాబాద్‌ లేని తెలంగాణా ఉండబోదు. కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకూ హైద్రాబాద్‌ను రెండు ప్రాంతాలకూ ఉమ్మడి రాజధానిగా ఉంచొచ్చు..' అని పేర్కొన్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణా అంశం ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉందని కేంద్ర సమాచార శాఖా మంత్రి మనీష్‌ తివారీ పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం

తెరాసకు మద్దతు వ్యాఖ్యలు: ఎర్రబెల్లికి చంద్రబాబు క్లాస్

తెరాసకు మద్దతు వ్యాఖ్యలు: ఎర్రబెల్లికి చంద్రబాబు క్లాస్:
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం క్లాస్ పీకారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మద్దతు ఇస్తామని చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన మందలించారు. పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. సహకార సంఘాల ఎన్నికల్లో తాము ఓ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోవడం లేదని, అవకాశం ఉన్న ప్రతి చోటా సొంతంగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సహకార సంఘాల ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వరంగల్‌ జిల్లా తొర్రురూలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెసు వ్యతిరేకిస్తోందని, అందుకే సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన తెరాస అభ్యర్థులకు తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు మొదటి నుంచీ మోసం చేస్తోందని, విద్యార్థుల మరణాలకు కాంగ్రెసు నాయకులే కారణమని ఆయన విమర్శించారు. పదవుల కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో వస్తున్నా... మీకోసం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందరికీ వంటగ్యాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచితంగా పొయ్యిలు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని ఆయన చెప్పుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన మాలపాడులో ప్రసంగిచారు. వంట గ్యాస్ ధరను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని ఆయన తప్పు పట్టారు. వంటగ్యాస్ కోసం కొత్త కనెక్షన్ కావాలంటే కొనుక్కునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని, విద్యుత్తు బిల్లుల మోతతో ప్రజలపై అధిక భారం పడిందని ఆయన అన్నారు.

Chitika Ads