ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మధ్య మళ్లీ ప్రచ్చన్న యుద్దం ముదిరినట్లు కధనాలు వస్తున్నాయి.దానికి తోడు ఈ ఇద్దరు నేతలకు చెరో ఛానల్ ఉండడంతో వాటిలో వచ్చే కధనాలు ఆధారంగా ఈ వివాదంపై కధనాలు వస్తున్నాయి.
బొత్స సత్యనారాయణ ఆకస్మికంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది.పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దీనిపై మాట్లాడుతూ కిరణ్ ను కూలదోయడానికి బొత్స కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.దానిపై బొత్స వర్గం ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు.ముఖ్యంగా ఈ వివాదాలపై ముఖ్యమంత్రి కిరణ్ కు చెందిన చానల్ లో బొత్స వ్యతిరేక కధనాలకు ప్రాముఖ్యత లభిస్తున్న తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పైగా జోగి రమేష్ పార్టీ వదలి పెడతారని ఒక ప్రచారంతో పాటు, ఆయన కిరణ్ కు సన్నిహితంగా ఉంటారని మరో ప్రచారం సాగుతుండడం విశేషం.బొత్స తొమ్మిది మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పకపోయినప్పట్టికీ, ఆయన అలా ప్రకటించడానికి ముందు సి.ఎమ్.తో మాట్లాడారా ?లేదా?ప్రభుత్వం మైనార్టీలోపడుతుందని తెలిసి కూడా బహిష్కరణ ప్రకటన చేయడంతో కిరణ్ ను ఇరుకున పెట్టే ఉద్దేశం ఉందా ?మొదలైన చర్చలు కాంగ్రెస్ లో జరుగుతున్నాయి.
No comments:
Post a Comment