హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం క్లాస్ పీకారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మద్దతు ఇస్తామని చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన మందలించారు. పార్టీ నాయకులతో చంద్రబాబు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. సహకార సంఘాల ఎన్నికల్లో తాము ఓ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకోవడం లేదని, అవకాశం ఉన్న ప్రతి చోటా సొంతంగానే పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సహకార సంఘాల ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం వరంగల్ జిల్లా తొర్రురూలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెసు వ్యతిరేకిస్తోందని, అందుకే సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన తెరాస అభ్యర్థులకు తమ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు మొదటి నుంచీ మోసం చేస్తోందని, విద్యార్థుల మరణాలకు కాంగ్రెసు నాయకులే కారణమని ఆయన విమర్శించారు. పదవుల కన్నా తమకు తెలంగాణ ముఖ్యమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలో వస్తున్నా... మీకోసం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అందరికీ వంటగ్యాస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉచితంగా పొయ్యిలు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని ఆయన చెప్పుకున్నారు. పాదయాత్ర సందర్భంగా ఆయన మాలపాడులో ప్రసంగిచారు. వంట గ్యాస్ ధరను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారని ఆయన తప్పు పట్టారు. వంటగ్యాస్ కోసం కొత్త కనెక్షన్ కావాలంటే కొనుక్కునే పరిస్థితి కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకడం లేదని, విద్యుత్తు బిల్లుల మోతతో ప్రజలపై అధిక భారం పడిందని ఆయన అన్నారు.
http://dotnews.in/ysrcp-mlas-letter-to-cm-chandrababu-naidu/
ReplyDelete