Telugu Updates

Sunday, 3 February 2013

వార్తలు కత్తి యుద్ధంలో ప్రభాస్, రాణాలకు ట్రై‌నింగ్

వార్తలు కత్తి యుద్ధంలో ప్రభాస్, రాణాలకు ట్రై‌నింగ్:
హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘బహుబలి'. ప్రస్తుత రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇది చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. తాజాగా అందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాణా కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ సోదరుడిగా నెగెటివ్ రోల్‌లో రాణా కనిపించబోతున్నాడు. ఈచిత్రంలో వీరిద్దరి మధ్య కత్తియుద్ధం సన్ని వేశాలు ఉండనున్నాయి. ఈ మేరకు వీరిద్దరికి కత్తియుద్దంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రోజే ఈ ట్రైనింగ్ మొదలైంది. ఈ విషయాలను తాజాగా రాజమౌళి వెల్లడించారు. ఈ భారీ సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు ప్రారంభ దశకు చేరకుంది. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ‘బహుబలి' టైటిల్‌తో రూపొందబోయే ఈ సినిమాను రాఘవేంద్రరావు, శోబు ఆర్కా మీడియా బేనర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.

No comments:

Post a Comment

Chitika Ads