వరంగల్: కాంగ్రెస్ నేతలకు టీఆర్‌ఎస్ నేతలు పిండప్రదానం చేశారు. ఇవాళ వరంగల్ చౌరస్తాలో ఆపార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నేతలు మరోసారి మోసం చేశారని ఆరోపిస్తూ వారు ఈ కార్యక్రమం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణలో తిరగనీయబోమని వారు హెచ్చరించారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయకపోతే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేయకుండా తెలంగాణ ప్రజలను మరోసారి వంచించారని వారు ఆరోపించారు.
No comments:
Post a Comment