న్యూఢిల్లీ: సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణ న్యాయవాదులు చేసిన సమ్మెపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సమ్మె కాలంలో తెలంగాణ న్యాయవాదులు హైకోర్టును బహిష్కరించి అనుచితంగా ప్రవర్తించారని పీవీ కృష్ణయ్య అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ ప్రారంభించింది. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు పటిషనర్ సరియైన సమాధానం చెప్పక పోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం ఇవ్వడానికి పిటిషనర్ మూడు నెలల గడువు కోరడంతో తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
No comments:
Post a Comment